ఇళ్ళు లేని వారికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం: సీఎం (వీడియో)

51చూసినవారు
AP: ఇల్లు లేని వారికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.." ఇంటింటికీ కుళాయి ద్వారా నిరంతరం నీళ్లు ఇచ్చేలా ప్రణాళిక చేస్తున్నాం. ఇళ్లు లేనివారికి ఇళ్లు కట్టించి ఇస్తాం. విద్యుత్ కనెక్షన్లు ఇస్తాం. మీ ఇంటి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసుకోండి. సోలార్ ప్లాంట్ మీ ఇళ్లపై నిర్మించుకుంటే భారీగా సబ్సిడీ ఇస్తా. పైపుల ద్వారా గ్యాస్ ఇస్తాం." అని అన్నారు.

సంబంధిత పోస్ట్