ఏనుగులు చూడటానికి ఎంత గంభీరంగా కనిపిస్తాయో.. కొన్నిసార్లు అంతే ఫన్నీగా ఉంటాయి. తాజాగా, ఓ ఏనుగు వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ షెడ్‌లో ఉన్న ఏనుగులకు ఓ వ్యక్తి స్నానం చేయిస్తుంటాడు. ఇంతలో ఓ ఏనుగుకు పైపుతో నీళ్లు కొడుతుండగా.. కాళ్ల కింద కూడా నీళ్లు పట్టాలని కోరుతూ అతడికి అనుకూలంగా తల కిందకు పెట్టి, ముందు కాళ్ల సాయంతో వెనుక కాళ్లను గాలిలోకి లేపింది. ఏనుగు యోగా చేస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.