ఏపీలో గత ఐదేళ్లలో 4,84,249 చెట్లు నరికేసినట్లు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు.
టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని లోక్ సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇందులో పట్టాదారు భూముల్లో 2,44,830, మళ్లించిన అటవీ భూముల్లో 1,35,023 చెట్లు, చట్టవిరుద్ధంగా 1,04,396 చెట్లను తొలగించినట్లు వెల్లడించారు. అత్యధికంగా తిరుపతి జిల్లాలో చట్టబద్ధంగా 61,964, చట్టవిరుద్ధంగా 40,349 చెట్లు నరికేసినట్లు పేర్కొన్నారు.