సెల్యూట్ కొట్టలేదని.. నెల రోజుల జీతం కట్!

85చూసినవారు
సెల్యూట్ కొట్టలేదని.. నెల రోజుల జీతం కట్!
ఒంగోలులో వింత ఘటన చోటు చేసుకుంది. కలెక్టరేట్‌లో ఒక ఉన్నతాధికారి కారిడార్‌లో వెళ్తుండగా.. మరో విభాగం కార్యాలయ అటెండర్ దాన్ని గమనించలేదు. తాను వస్తుంటే అటెండర్ లేచి సెల్యూట్ కొట్టకపోవడంతో సదురు ఉన్నతాధికారి భగ్గుమన్నారు. అటెండర్‌ను చూపిస్తూ.. ‘వీడికి పనీ పాటా లేదు.. వీడెందుకు ఇక్కడ.. నెల రోజుల జీతం కట్ చేయండి.’ అంటూ కార్యాలయ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. దీనిపై స్థానికంగా చర్చ నడుస్తోంది.

సంబంధిత పోస్ట్