ఉక్రెయిన్ యుద్ధ ఖైదీ భార్య లారిసా సలేవా సంచలన ఆరోపణ చేసింది. ఆమె ప్రస్తుతం మరియోపోల్ గ్రూప్ ఫ్రీడం టు డిఫెండర్స్ హెడ్‌గా పనిచేస్తోంది. రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్‌కు పంపించిన మృతదేహాల్లో కీలక అవయవాలు మాయమయ్యాయని ఆమె ఆరోపించారు. ఉక్రెయిన్ సైనికుల శరరీ భాగాలను రష్యా విక్రయిస్తోందని చెప్పారు. అయితే, ఇదో తప్పుడు ప్రచారం అని రష్యా సైన్యం కొట్టి పారేసింది.