మడ అడవుల పర్యావరణ వ్యవస్థ గురించి అవగాహన కల్పించేందుకు.. 2015లో యునెస్కోలో జరిగిన జనరల్ కాన్ఫరెన్స్ లో జూలై 26 న అంతర్జాతీయ మడ అడవుల పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. మడ అడవుల సంరక్షణ, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యం. మడ అడవులు.. తీరప్రాంత అడవులతో పోలిస్తే వాతావరణం నుంచి ఐదు రెట్లు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి.