మడ అడవులు.. పర్యావరణ పరిరక్షణకు ప్రకృతి ప్రసాదించిన వరాలు. తీర ప్రాంతాలకు సహజ రక్షణ గోడలు. సముద్ర తీర జీవవైవిధ్యంలో వీటిదే కీలక పాత్ర. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి మనుషుల్ని, వన్యప్రాణుల్ని కాపాడుతున్నాయి. కోట్ల మంది జీవనోపాధికి ఆసరాగా నిలుస్తున్నాయి. వీటిని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మానవాళిపై ఉంది.