అంతర్జాతీయ మడ అడవుల పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 26న జరుపుకుంటారు. పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నా మడ వనాల విధ్వంసం ఆగడంలేదు. ప్రకృతి విపత్తులతోనూ మరికొంత మాయమవుతోంది. నదులు, సముద్రం కలిసేచోట ఏర్పడే ఉప్పు కయ్యల్లో, నదీ ముఖ పరివాహక ప్రాంతాల్లో ఈ వనాలు పెరుగుతాయి. విపత్తుల వేళ గాలుల తీవ్రతను నిలువరించి మానవాళికి రక్షణ కల్పిస్తూ, వేలాది మత్స్యకారులకు జీవనభృతి చూపుతాయి.