కేరళకు చెందిన నిమిష ప్రియ అనే నర్సుకు యెమెన్‌లో ఉరిశిక్ష పడింది. ఆమె 2011లో భర్తతో కలిసి ఆమె యెమెన్ వెళ్లింది. అక్కడ తలాల్ మహదీతో కలిసి ఆమె క్లీనిక్ ప్రారంభించింది. పిల్లలు, భర్త స్వదేశానికి వెళ్లాక అతడు ఆమెను వేధించాడు. దీంతో ఆమె మత్తు మందు ఇవ్వగా.. డోస్ ఎక్కువై అతడు మరణించాడు. ఈ కేసులో 2017 నుంచి జైల్లో ఉన్నారు. ఆమె పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను ఆ దేశ అధ్యక్షుడు తిరస్కరించారు. ఆమె మరణశిక్ష ఖరారు చేశారు.