ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీకి ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే తలనొప్పులు తప్పడం లేదు. టీడీపీ ఎమ్మెల్యేల వివాదాలకు చెక్ పెట్టేందుకు ఐదుగురు సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. హెచ్చరికలు జారీ చేసిన ఎమ్మెల్యేలు వికపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ సీనియర్లతో కమిటీ వేయనున్నారు. ఎమ్మెల్యేలు గీత దాటితే వేటు తప్పదనే రీతిలోనే చంద్రబాబు వ్యవహరిస్తున్నారు.