శాకాహార భోజనం ధర పైపైకి

51చూసినవారు
శాకాహార భోజనం ధర పైపైకి
క్రిసిల్‌ నివేదిక ప్రకారం శాకాహార భోజనం ఖరీదు ఏడాదికేడాదికి గణనీయంగా పెరుగుతోంది. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇళ్లలో చేసుకునే శాకాహార భోజనం ఖర్చు 11 శాతం పెరిగిందని, అదే హోటళ్లు, రెస్టారెంట్లలో 31.3 నుండి 37 శాతం దాకా ఈ పెరుగుదల ఉందని పేర్కొంది. టమాటా, ఉల్లి, ఆలూ ధరలు భారీగా పెరగడమే ఈ పరిస్థితికి కారణమని వివరించింది. శాకాహార భోజనంలో 9శాతంగా ఉండే పప్పుల ధరలు కూడా ఈ ఏడాది కాలంలో 14శాతానికి పెరిగాయని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్