ఐపీఎల్ 2025లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా సోమవారం ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. ముంబై స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ 28 పరుగులకు ఔట్ అయ్యారు. పన్నెండో ఓవర్లో యష్ దయాల్ వేసిన ఆఖరి బంతికి లివింగ్‌స్టన్‌కు క్యాచ్ ఇచ్చి సూర్య పెవిలియన్ చేరారు. దీంతో 12 ఓవర్లకు ముంబై స్కోరు 97/4గా ఉంది. క్రీజులో తిలక్ వర్మ (11), హార్దిక్ పాండ్య (0) ఉన్నారు.