లంబసింగి పరిసర ప్రాంతంలో పిడుగుల శబ్దంతో కూడిన భారీ వర్షం

72చూసినవారు
చింతపల్లి మండలంలోని లంబసింగి పరిసర ప్రాంతంలో బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఉరుములు మెరుపులు పిడుగుల శబ్దంతో కూడిన భారీ వర్షం కురిసింది. అయితే కురిసిన భారీ వర్షం కారణంగా ఉదయం నుంచి ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు ఉపశమనం లభించింది. గంటలపాటు కురిసిన భారీ వర్షం కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్