ఆనందపురం మండలంలోని బాకూరుపాలెం, కుసులువాడ పంచాయతీల మధ్య చిన్నయ్యపాలెం వద్ద ఉన్న ఘాన్ మెరైన్ ప్రోడక్ట్ (జిఎంపి) సీ ఫుడ్ కంపెనీ కాలుష్యంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, దీంతో ప్రజారోగ్యానికి ముప్పు ఉందని జివిఎంసిలో సిపిఎం ఫ్లోర్‌లీడర్, 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి. గంగారావు అన్నారు. శుక్రవారం కంపెనీ గేటు వద్ద సిపిఎం ఆధ్వర్యంలో చిన్నయ్యపాలెం గ్రామస్తులు ధర్నా నిర్వహించారు.