భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఈనెల 11న చలో అనకాపల్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏ. ఐ. టీ. యూ. సీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం చోడవరం భవన నిర్మాణ కార్మికుల కేంద్రంలో కార్మికులతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరోజు ఆర్డిఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు.