పెట్రోల్ బంకులో గ్యాస్ సిలెండర్ తో యువకుడు హల్ చల్

74చూసినవారు
విశాఖ జిల్లా గోశాల జంక్షన్ వద్ద ఉన్న పెట్రోల్ బంకు లో రాజు అనే యువకుడు పోలీసుల నిర్లక్ష్య వైఖరితో విసుగు చెంది బుధవారం హల్ చల్ చేసాడు. గ్యాస్ సిలిండర్, లైటర్ తీసుకువచ్చి పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ ట్యాంకర్ అన్ లోడింగ్ జరుగుతున్న సమయంలో గ్యాస్ సిలెండర్ ఓపెన్ చేస్తానంటూ హల్ చల్ చేశాడు. సామాన్యుడికి పోలీస్ స్టేషన్లో విలువలేదని అందుకే ఇలా చేస్తున్నానంటూ అన్నాడు. స్థానిక ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు రావడంతో గండం గట్టెక్కింది. మీడియా నా వద్దకు వచ్చి తన ఆవేదన వినాలని రచ్చ చేశాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్