విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం

60చూసినవారు
విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం
స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్-1లో మంగళవారం ప్రమాదం జరగడంతో షిఫ్ట్ ఇంఛార్జ్ మల్లేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఎల్పీబే స్టీల్ ల్యాడిల్ బ్లాస్ట్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు చెప్తున్నారు. మల్లేశ్వరరావును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకోగా, పోలీసులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్