అల్లూరి జిల్లాలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

70చూసినవారు
అల్లూరి జిల్లాలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
కొయ్యూరు మండలం బకులూరు గ్రామ శివారులలో గురువారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడి ఉందని, మృతదేహంపై జీడిమామిడి కొమ్మలు కప్పి ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you