గొలుగొండ: వ్యాధుల నియంత్రణపై అవగాహన

83చూసినవారు
గొలుగొండ: వ్యాధుల నియంత్రణపై అవగాహన
జాతీయ ఆయుష్ మిషన్ ప్రోగ్రాంపై గొలుగొండ మండలం కృష్ణదేవిపేట పీహెచ్సీ పరిధిలోని ఆశా కార్యకర్తలకు బుధవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ ఆయుష్ మిషన్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ డాక్టర్ కళావతి ఆయుష్ వైద్యం ద్వారా ఆరోగ్య పరిరక్షణ, సాధారణ వ్యాధులతో పాటు మధుమేహం నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ డాక్టర్ హరిప్రవీణ్, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.