నర్సీపట్నంలో నాటు కోళ్లకు గిరాకీ పెరిగింది. బుధవారం కనుమ పండుగ రోజు కావడంతో నాటు కోళ్లు కొనుగోలుకు ప్రజలు ఎగబడ్డారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన కోళ్ల పెంపకం దారులు ఇదే అవకాశంగా ధరలు పెంచేశారు. ఒక చిన్న నాటుకోడి సైతం రూ. 1500 ధర పలకడం విశేషం. అంతేకాకుండా 5000 రూపాయలకు ఒక కోడిని విక్రయించినట్లు అమ్మకం దారులు తెలిపారు. పెంపకం దారులు మంచి లాభాలను అర్జించారు.