విశాఖలో వాల్తేరు రైల్వే డివిజన్ హాస్పిటల్ లో క్యాన్సర్ పై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న రైల్వే హాస్పిటల్ వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణరావు మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు ఆహారపు అలవాట్లు కారణంగా పలువురు క్యాన్సర్ బారిన పడుతున్నారని అన్నారు. క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ సాధ్యపడుతుందన్నారు. ప్రజల దూరలవాట్లకు దూరంగా ఉండాలన్నారు.