విశాఖ: లలితానగర్‌లో క్రిస్మస్ వేడుకలు
విశాఖలోని లలితానగర్‌లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు బొల్లవరపు జాన్ వెస్లీ కార్యాలయంలో బుధవారం క్రిస్మస్ సందర్భంగా పలువురు జాన్ వెస్లీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నా జానకిరామ్, తదితరులు పాల్గొన్నారు.