అల్లూరి జిల్లా గూడెంకొత్తవీధి మండలంలోని దారకొండ పంచాయతీ పరిధి కమ్మరితోట గ్రామంలో నెలలు నిండిన గర్భిణీలకు అలాగే బాలింతలకు ఆశా కార్యకర్త నీలమ్మ మంగళవారం కిల్కారి కాల్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె గర్భిణీలకు పలు సూచనలు చేశారు. డయేరియా విరోచనాలు వాంతులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గర్భిణీలు ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు.