చింతపల్లి: హైవే రోడ్డుపై ప్రమాదం.. ముగ్గురికి తీవ్రగాయాలు
చింతపల్లి మండలంలోని మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మల్లవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు పల్సర్ బైక్ పై వేగంగా వెళుతూ అంతర్ల సమీపంలోని హైవే రోడ్డు వద్ద ఓ యువకుడ్ని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారిని 108 అంబులెన్స్ లో చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు.