జ‌ర్న‌లిస్టు హెల్త్ కార్డుల‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

66చూసినవారు
జ‌ర్న‌లిస్టు హెల్త్ కార్డుల‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌
2024-25 ఆర్థిక సంవ‌త్స‌రానికి జారీ చేయు జ‌ర్న‌లిస్టుల హెల్త్ కార్డుల కొర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఎం. ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ శ‌నివారం తెలిపారు. ద‌ర‌ఖాస్తులను జిల్లా స‌మాచార పౌర సంబంధాల శాఖ కార్యాల‌యంలో అంద‌జేయాల‌ని సూచించారు. జిల్లాలోని జ‌ర్న‌లిస్టుల విజ్ఞ‌ప్తి మేర‌కు తెల్ల‌రేష‌న్ కార్డు క‌లిగి అక్రిడిటేష‌న్ పొందిన‌ పాత్రికేయుల‌కు రూ. 1250 ప్రీమియం చెల్లిస్తామన్నారు.