ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఇంకా విషం కక్కుతుండడంపై ఆ ప్రాంతానికి చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఎక్కడా నీరు నిలవ లేదని వారు స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఇప్పటికైనా నీచ రాజకీయాలు మానుకోవాలనంటూ మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వారు హితవు పలికారు.