AP: గత ప్రభుత్వం అమరావతిని ఏడారిగా చేసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. రూ.లక్షల కోట్ల అప్పులు చేశారని, ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఒక వ్యక్తి అవగాహన లేకుండా, రాష్ట్రం ఏమైనా పర్వాలేదని ముందుకు వెళ్లడంతో ఈ పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. అయితే, నేడు అమరావతి పనులు ప్రారంభమవుతున్నాయని, రాజధానిని నెం.1గా నిలపడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.