పామిడి పట్టణంలోని చైతన్య కాలనీ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో ఎర్రిస్వామి అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన అతన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.