

పెద్దవడుగూరు: 110 మామిడి చెట్లు నరికిన దుండగులు
పెద్దవడుగూరు మండలం చిత్రచేడు గ్రామనికి చెందిన ఐదు మంది టిడిపి సానుభూతిపరులకు చెందిన 110 మామిడి చెట్లను గుర్తుతెలియని దుండగులు నరికి వేశారు. చిత్రచేడు గ్రామ శివారులోని పెన్నా నది పరివాహ ప్రాంతంలో గల ప్రభుత్వ భూమిలో ఐదుగురు కలిసి మామిడి మొక్కల నాటి వాటిని సంరక్షిస్తున్నారు. మొక్కలు కాస్తా చెట్లవుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు చెట్లను నరికి వేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు.