కళ్యాణదుర్గం పట్టణ నూతన సీఐగా వెంకటరమణ గురువారం బాధ్య తలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పోలీస్ సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా పట్టణ పోలీస్ స్టేషన్లో పరిష్కరించుకోవచ్చని అన్నారు. జూదంపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.