ఘనంగా రిజర్వేషన్ల పితామహుడు సాహూ మహారాజ్ జయంతి వేడుకలు

52చూసినవారు
రాయదుర్గం పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో చత్రపతి సాహు మహారాజ్ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సమీపాన బీఎస్పీ పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. బిఎస్పి స్టేట్ సెక్రటరీ చిందనూరు నాగరాజు ఆధ్వర్యంలో సాహూ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. 20 ఏళ్ల వయస్సులోనే కొల్హాపూర్ సంస్థానానికి రాజు అయిన గొప్ప నాయకుడు అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్