జిల్లా సర్వజన వైద్యశాలలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు ఈ నెల 22 నుంచి మెడికల్ బోర్డు సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు శుక్రవారం తెలిపారు. ప్రతి మంగళవారం, శనివారం మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు అందిస్తామన్నారు. తలసీమియా, అనీమియా, పక్షవాతం, బోధకాలు, ప్రమాదంలో కుర్చీకి పరిమితం అయినవారికీ, కుష్టు రోగులు, గుండెమార్పిడి, కిడ్నీ మార్పిడి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు ఇస్తామన్నారు.