అమిత్ షా పై కేసు నమోదు చేయాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ సంఘాల జెఏసి రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, గిరిజన, మైనార్టీ సంఘాల నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమామ్ అనంత జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై వెంటనే కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.