అధికారులు ప్రజలకు జవాబుదారీగా పని చేయాలని అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బోయగిరిజమ్మ బుధవారం పేర్కొన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో సీఈఓ రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో స్థాయి సంఘాల సమావేశం జరిగింది. సమావేశంలో గతంలో జరిగిన అభివృద్ధి పనుల పురోగతి, జరుగుతున్న అభివృద్ధి పనులను గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే సమస్యలను సత్వర పరిష్కారం చేయాలన్నారు.