అనంతపురం నగర శివారులోని ఓ కళాశాల ఎదురుగా ఆదివారం బైక్ డివైడర్ ను ఢీకొని కింద పడింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న రాజు కాలనీకి చెందిన గౌస్ అనే వ్యక్తి కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గౌస్ కు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.