అనంతపురంలో ఉద్రిక్తంగా మారిన కలెక్టరేట్ ముట్టడి

51చూసినవారు
అనంతపురం జిల్లా అంబేడ్కర్ గురుకుల పాఠశాలల జిల్లా కన్వీనర్ మురళీ కృష్ణను సస్పెండ్ చేయాలని గురువారం దళిత, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేశారు. దళిత, విద్యార్థి సంఘాల నాయకులు కార్యాలయం ముందు ఉన్న బారికేడ్లు పక్కకు నెట్టి కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. భారీగా మోహరించిన పోలీసులు వారిని నిలువరించారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది.

సంబంధిత పోస్ట్