కర్మయోగి శ్రీ ధర్మవ్యాధుడు చరిత్ర సినిమాను విడుదల

1935చూసినవారు
కర్మయోగి శ్రీ ధర్మవ్యాధుడు చరిత్ర సినిమాను విడుదల
ఆరెకటిక కుల గురువు కర్మయోగి శ్రీ ధర్మవ్యాధుడి చరిత్ర ఆధారంగా రూపొందించిన సినిమాను శుక్రవారం అనంతపురం నగరంలోని నీలిమ ధియేటర్ నందు జిల్లా జెడ్పి చైర్మేన్ బోయ గిరిజమ్మ, మేయర్ మహమ్మద్ వసీం విడుదల చేశారు. సాయినాథ్, నాగేంద్రల ఆధ్వర్యంలో వైసిపి సీనియర్ నాయకులు అనంత చంద్రారెడ్డి సమక్షంలో విడుదల చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఓబి రెడ్డి, ఏపీ ఆరెకటిక కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మీబాయ్, పలువురు బిసి కార్పొరేషన్ డైరెక్టర్లు, కార్పొరేటర్లు, ఆరేకటిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you