బత్తలపల్లి తహసీల్దార్ కార్యాలయం ఖాళీ..!
బత్తలపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు లేక ఖాళీగా దర్శనమిస్తోంది. అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖలో సిబ్బంది ఉన్నా ప్రజా పనులు జరగడం లేదు. అలాంటిది ఈ కార్యాలయంలో కీలకమైన అధికారుల పోస్టులు భర్తీచేయకపోవడంతో ప్రజా సమస్యలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. గత వైసీపీ పాలనలో ఆ పార్టీ నాయకుల ఒత్తిళ్లు తట్టుకోలేక చాలా మంది అదికారులు సెలవుపై వెళ్లి మరో చోటికి బదిలీ చేయించుకున్నారు. కార్యాలయంలో అర్ఐ2 ఐదేళ్లు, ఆర్ఐ1 రెండేళ్లుగా లేరు. రెండేళ్లుగా డీటీ పోస్టు ఖాళీ.