గుండెపోటుతో యువకుడు మృతి
బొమ్మనహాల్ మండలంలోని సింగనహళ్లిలో గుండెపోటుతో గురువారం ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన నవీన్ (22) బుధవారం రాత్రి గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు బళ్లారి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతుడు నవీన్ కు 3 నెలల క్రితమే కణేకల్లు మండలం బెణేకల్లకు చెందిన నందినితో వివాహం జరిగింది.