నటి శ్వేతా బసు ప్రసాద్ నటించిన 'ఊప్స్ అబ్ క్యా' అనే వెబ్ సిరీస్ ఫిబ్రవరి 20న జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తెలుగు సినిమా సెట్ లో ఒక హీరో తనని వేధింపులకు గురిచేశాడని తెలిపారు. అతడి హైట్ ఆరు అడుగులు అని.. ఆమె హైట్ 5.2 అడుగులు ఉండడంతో ప్రతి ఒక్కరు ఎగతాళి చేశారని పేర్కొన్నారు. అయితే ఏ సినిమా సమయంలో ఈ వివాదం జరిగిందనే విషయాన్ని చెప్పలేదని అన్నారు.