TG: మేడ్చల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాకేంద్రం సమీపంలోని కిష్టాపూర్‌కు చెందిన వెంకటరమణను.. తన అక్క కుమారుడు కత్తితో మెడకోసి హత్య చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.