పెద్దపప్పూరు: అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి
చిలమత్తూరు మండలంలోని నల్లబొమ్మనపల్లిలో అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని పెద్దపప్పూరు మండల సీపీఐ కార్యదర్శి చింతా పురుషోత్తం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని హరేరామ ఆశ్రమ ఆవరణంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో అయన మాట్లాడుతూ.. సమాజం అసహ్యించుకునే విధంగా అత్తా, కోడళ్లపై అత్యాచారం చేయడం సహించరాని నేరమని, నేరస్థులను క్షమించకుండా వెంటనే కఠినంగా శిక్షించాలని కోరారు.