ధర్మవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం సంక్రాంతిని పురస్కరించుకొని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఇదే సందర్భంలో ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది తయారు చేసిన వివిధ వంటకాల రుచిని మంత్రి చూసి రొట్టెలు, గుగ్గిళ్లు, ఆకుకూరలు, తదితర వంటకాలు బాగున్నాయని మెచ్చుకున్నారు.