లీలావతి అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

85చూసినవారు
లీలావతి అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం
యాడికి మండలంలోని రాయలచెరువు గ్రామంలోని లీలావతి వృద్ధాశ్రమంలో గురువారం అన్నదాన కార్యక్రమం చేశారని ఆశ్రమ నిర్వాహకురాలు పరిమి కృష్ణవేణి తెలియజేశారు.రాయల చెరువు గ్రామానికి చెందిన ముప్పవరపు రామకృష్ణ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం ఆయన కుమారుడు ముప్పవరపు మురళీకృష్ణ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భోజనం అనంతరం వృద్ధులందరూ మురళీకృష్ణ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు.