ధర్మవరం పట్టణం ఎర్రగుంట సర్కిల్ వద్ద బ్రహ్మంగారి గుడి పక్కన మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహేశ్ అనే ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఎర్రగుంట నుంచి మోటమర్ల గ్రామానికి వెళ్లే ఒక ద్విచక్ర వాహనదారుడు మహేశ్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మహేష్ ను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.