ముదిగుబ్బలోని కస్తూరిబా పాఠశాల, బీసీ హాస్టల్లో మలేరియా యూనిట్ అధికారులు ఆదివారం పిచికారీ చేశారు. దోమల నివారణ కోసం మలతీన్ పౌడర్ పిచికారీ చేశారు. వర్షాకాలం మొదలైనందున దోమలు ఎక్కువగా వృద్ధి చెందుతాయని దీని వలన మలేరియా, డెంగ్యూ, చికున్ గునియా మొదలగు వ్యాధుల బారిన హాస్టల్ విద్యార్థులు పడకుండా ముందు జాగ్రత్త చర్యలుగా ప్రతి హాస్టల్లో క్రిమిసంహారక మందులు పిచికారి చేసినట్లు తెలిపారు.