అక్టోబర్ 1 నుంచి కొత్త పాలసీ: మంత్రి

67చూసినవారు
అక్టోబర్ 1 నుంచి కొత్త పాలసీ: మంత్రి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం విధానంపై కొత్త పాలసీని త్వరలోనే తీసుకురానుందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని పేర్కొన్నారు. సొంత ఆదాయం పెంచుకునేలా.. ప్రభుత్వం ఆదాయానికి గండి కొట్టేలా గత ప్రభుత్వం మద్యం పాలసీ చేసుకుంది. నాటి మద్యం పాలసీ వల్ల ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతింది. అక్టోబర్ 1 నుంచి కొత్త పాలసీని తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్