గార్లదిన్నె మండలంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు
గార్లదిన్నె మండలంలో పేకాట స్థావరాలపై పోలీసులు సోమవారం మెరుపు దాడులు నిర్వహించారు. మండల పరిధిలోని కనుంపల్లి గ్రామం పరిసర ప్రాంతాల్లో పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఐ మహమ్మద్ గౌస్ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. దాడుల్లో ఐదు మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 15, 350ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.