బుదేడు వీఆర్వోను సస్పెండ్ చేయాలని నిరసన

51చూసినవారు
బుదేడు వీఆర్వోను సస్పెండ్ చేయాలని నిరసన
గార్లదిన్నె మండలం కృష్ణాపురం రైతు మరణానికి కారణమైన బూదేడు వీఆర్ ఓ మధును వెంటనే సస్పెండ్ చేయాలని రైతుసంఘం నాయకులు కలెక్టర్ ఆఫీస్ ముందు బుధవారం ఆందోళన చేశారు. రైతు సూర్యనారాయణ చిత్రపటానికి ముందుగా రైతు సంఘం నాయకులు నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తరిమెల నాగరాజు, జిల్లా ప్రధాన కార్యాదర్శి చంద్రశేఖర్ రెడ్డిలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్