విద్యుదాఘాతంతో రైతు మృతి
గార్లదిన్నె మండలం యర్రగుంట్లకు చెందిన రైతు నాగార్జున(34) శుక్రవారం విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు ఎస్ ఐ గౌస్ బాషా తెలిపారు. పొలం వద్దకు వెళ్లగా విద్యుత్తు మోటారుకు అమర్చిన స్టాటర్ మీటను నొక్కడానికి ప్రయత్నించడంతో విద్యుత్తు సరఫరా రావడంతో అక్కడే పడిపోయాడు. సమీప ప్రాంతంలో వ్యవసాయ పనులు చేసు కుంటున్న కుటుంబ సభ్యులు గమనించి వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.